పాల్వంచ, అక్టోబర్ 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం మేయర్ గణేష్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు రెస్టారెంట్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు, ఆహ్వానితులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
పాల్వంచలో స్వాతి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు, కుటుంబాలతో వచ్చే వినియోగదారులకు ఆతిథ్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడింది.
Post Views: 59









