నిజాయితీ చాటుకున్న ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు.. పోగొట్టుకున్న పర్సు, రూ.9 వేల నగదు యజమానికి అప్పగింత

ఖమ్మం, నవంబర్ 5: విధి నిర్వహణలో నిజాయితీ, బాధ్యతాయుత సేవలకు నిదర్శనంగా ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు నిలిచారు. స్థానిక జడ్పీ సెంటర్ వద్ద ఆటో నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయిన పర్సును గుర్తించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ దానిని భద్రపరిచి యజమానికి తిరిగి అందజేశారు.

జడ్పీ సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు రోడ్డుపై పడి ఉన్న పర్సు కనిపించడంతో దానిని తీసి పరిశీలించారు. అందులో ఒక పేటీఎం కార్డుతో పాటు రూ.9,000 నగదు ఉన్నట్లు గుర్తించారు. అయితే పర్సులో యజమానికి సంబంధించిన ఇతర వివరాలు లేకపోవడంతో పేటీఎం కార్డు ఆధారంగా ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ యజమాని చిరునామాను గుర్తించారు.

అనంతరం పర్సు యజమానిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ట్రాఫిక్ సీఐ శివప్రసాద్ చేతుల మీదుగా పర్సుతో పాటు రూ.9,000 నగదును తిరిగి అందజేశారు.

తమకు దొరికిన సొత్తును బాధ్యతగా యజమానికి అప్పగించిన ట్రాఫిక్ పోలీసుల చర్యపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆస్తులను కాపాడటంలో పోలీసుల నిబద్ధతకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :