భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం–జగన్నాధపురం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో గురువారం అమ్మవారికి 108 స్వర్ణ పుష్పాలతో వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక హారతి, మంత్రపుష్పం, వివిధ తాంత్రిక పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎ. విజయకుమార్, అర్చకులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

6న నందీశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో నవంబర్ 6వ తేదీ శుక్రవారం త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రదోషకాలంలో నందీశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామార్చన తదితర పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

7న వైభవంగా రుద్రహోమం

మాసశివరాత్రిని పురస్కరించుకుని నవంబర్ 7వ తేదీ శనివారం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో రుద్రహోమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శాస్త్రోక్తంగా ఈ హోమ కార్యక్రమం జరగనుంది. రుద్రహోమంలో పాల్గొనదలచిన భక్తులు ముందుగా రూ.1,516 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. హోమంలో పాల్గొనే దంపతులకు స్వామివారి శేషవస్త్ర ప్రసాదం అందజేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు 6303408458 నంబర్‌ను సంప్రదించాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎ. విజయకుమార్ కోరారు. కార్తీక మాసంలో నిర్వహించే ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :