ప్రమాదానికి గురైన కానిస్టేబుల్‌కు తోటి బ్యాచ్‌మెట్స్ ఆర్థిక సహాయం

కొత్తగూడెం అక్టోబర్ 23 : విధి నిర్వహణలో భాగంగా వాహన తనిఖీలు చేస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ పి. రవికుమార్‌కు ఆయన తోటి బ్యాచ్‌మెట్స్ అండగా నిలిచారు. 2009 బ్యాచ్‌ కానిస్టేబుల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు మానవత్వంతో స్పందించి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

వివరాల్లోకి వెళితే.. టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ పి. రవికుమార్‌ వాహన తనిఖీలు చేస్తుండగా లారీ ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన మోకాలి భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో కొత్తగూడెంలోని గణేష్‌ టెంపుల్‌ ప్రాంతంలో ఉన్న వరుణ్‌ ఆసుపత్రిలో ఆయనకు మోకాలికి శస్త్రచికిత్స నిర్వహించారు.

రవికుమార్‌ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న 2009 బ్యాచ్‌ కానిస్టేబుల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు వెంటనే స్పందించారు. చికిత్స ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సహాయాన్ని అందించిన వారిలో అసోసియేషన్‌ సభ్యులు చంద్రశేఖర్‌, మోహన్‌, జహీర్‌, లక్ష్మణరావు, సురేష్‌ తదితరులు ఉన్నారు. ఆపద సమయంలో తోటి సహచరుడికి అండగా నిలిచి, తమ బ్యాచ్‌ సభ్యుల మధ్య ఉన్న ఐక్యతను చాటుకున్న కానిస్టేబుళ్లను పలువురు అభినందిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :