ఖమ్మం, అక్టోబర్ 22: ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి 9 తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్న ఆదివాసీ సంఘాల నాయకులు కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం చుంచు రామకృష్ణ మాట్లాడుతూ, ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం కొమరం భీమ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆదివాసీ జాతి హక్కులు, ఆత్మగౌరవం, జాతి పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఆదివాసీ సమాజ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం దొర పటేల్‌తో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీ మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 225









