తేగడ: బతుకమ్మ నిమజ్జనాల సందర్భంగా తేగడ గ్రామంలోని తాలిపేరు నది వద్దకు విచ్చేసిన భక్తులకు తేగడ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మజ్జిగ, పానకం, చల్లని తాగునీటిని పంపిణీ చేశారు. నిమజ్జనానికి వచ్చిన మహిళలు, భక్తులు, చిన్నారులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ జమ్ములు మురళీకృష్ణ, ఉప సర్పంచ్ పాగా రాంప్రసాద్ ఆధ్వర్యంలో, పాకలపాటి సత్యనారాయణ రాజు యువ నాయకత్వంలో, కుప్పాల సౌజన్య సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. నిమజ్జనానికి వచ్చిన భక్తులకు అవసరమైన పానీయాలను అందిస్తూ సేవలందించారు.
ఈ కార్యక్రమంలో నిరంజన్, ఎంఎల్‌ఎన్ రెడ్డి, చినిగిరి నరేష్, సత్తిబాబు, రవి, శ్రీను, నాగరాజు, ఈరన్న, నరసింహ, రామ్, వెంకటేశ్వర్లు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది, యువకులు, స్వచ్ఛంద సేవకులు సహకరించి భక్తులకు సేవలందించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. పండుగ వేళ నిమజ్జనానికి వచ్చే భక్తులకు సేవ చేయడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందించారు.









