భద్రాచలం, అక్టోబర్ 19: భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు, విద్యార్థినీ విద్యార్థులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట తెలిపారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
దేవీ నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను వివిధ అలంకరణలతో పూజిస్తూ భక్తిశ్రద్ధలతో దసరా పండుగను జరుపుకోవడం మన సంప్రదాయమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
భద్రాచలం డివిజన్‌లోని వివిధ మండలాలు, గ్రామాల్లో పనిచేస్తున్న అధికారులు, రెవెన్యూ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది, సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సంతోషం నింపాలని ఆకాంక్షించారు.









