✅ తెలంగాణ సంస్కృతి, భాష, ఆత్మగౌరవానికి ప్రత్యేక గుర్తింపు
దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలు, అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నేటితో విజయవంతంగా 12 వసంతాలు పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్ల స్వయం పాలనలో తెలంగాణ ఒక శక్తివంతమైన గ్రోత్ ఇంజిన్‌గా అవతరించింది. సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించడంలో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఐటీ ఎగుమతులు, అద్భుతమైన పారిశ్రామిక వృద్ధి, గురుకుల విద్య, మూడు రెట్లు పెరిగిన తలసరి ఆదాయంతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానాల సరసన నిలిచింది.దశాబ్దాల పోరాటాలు, వందలాది మంది అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నేటితో 12 వసంతాలు పూర్తి చేసుకుంది. ‘మా కొలువులు మాగ్గావాలె’ అనే నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర కాంక్షను నిప్పు కణికలా రగిలించింది. వేలమంది చావును ముద్దాడి ఆరు దశాబ్దాలకు పైగా నిరంతర పోరాటాల ఫలితంగా ఏర్పాటైంది. ఈ 12 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతం ఒక గ్రోత్ ఇంజిన్‌లా మారి దేశానికే సరికొత్త మోడల్‌గా అవతరించింది.భాష, యాసల పేరిట జరిగిన అవహేళనలను తిప్పికొడుతూ.. నేడు బతుకమ్మ, బోనాలు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అస్తిత్వాన్ని సగర్వంగా చాటుతున్నాయి. ‘‘వలసల రాష్టం నుంచి అన్నపూర్ణ ‘’గా మారి 12 వసంతాలు పూర్తిచేసుకుని ప్రగతి పయనం సాగిస్తున్న తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటాలు వందలమంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ మా కొలువులు మాగ్గవలే అని కోట్లాడీ తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ అటువంటి గొప్ప రాష్ట్రం తెలంగాణ కు మరియు రాష్ట్ర ప్రజలకు మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలతో జై తెలంగాణ
……స్టాలిన్ మర్లపాటి
Post Views: 57









