సిద్ధిపేట జిల్లా మిట్టపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదo
• ప్రమాదంలో దంపతులు మృతి
తొలిఅడుగు న్యూస్ రిపోర్టర్ : మామిడి జగన్ మోహన్
సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
మణుగూరుకు చెందిన లక్ష్మీ గణేష్ గ్రాఫిక్స్ అధినేత ప్రభాకర్ తమ్ముడు రవి తన కుటుంబ సభ్యులతో కలిసి మణుగూరు నుంచి సిద్ధిపేటకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మిట్టపల్లి గ్రామ పరిసరాల్లో రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని కారు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రతకు కారు లారీ కింద ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో రవి మరియు ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
కారులో ఒకే కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, మణుగూరు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర ప్రయాణికుల పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది.









