గంభీరావుపేట డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి అవార్డు

గంభీరావుపేట డిగ్రీ కళాశాలకు జాతీయ స్థాయి అవార్డు.

గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలకు ఈరోజు అనగా జూన్.1 -2026 పర్యావరణ పరిరక్షణ హరిత కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి గారు గ్లోబల్ పీస్ ఆడిటోరియం గచ్చిబౌలిలో జరిగిన జాతీయస్థాయి అవార్డు ప్రధాన ఉత్సవంలో ప్లాటినం క్యాంపస్ పార్టనర్-2026 జాతీయస్థాయి అవార్డు ప్రిన్సిపాల్ గారు అందుకోవడం జరిగింది.

ఈ జాతీయ స్థాయి అవార్డును రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ వారు కళాశాలలో పాటిస్తున్న పర్యావరణ పరిరక్షణ, పర్యావరణఅనుకూలత, నీటి సంరక్షణ, మొక్కల పెంపకం విధానాలను అవలంబించిన పద్ధతులకు గాను కళాశాలకు ఈ అవార్డు ప్రధాన చేయడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గంభీరావుపేట జాతీయస్థాయిలో 44 స్థానం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి స్థానం దక్కినందుకు ప్రిన్సిపాల్ గారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ అవార్డు రావడానికి కీలక పాత్ర పోషించిన బాటని అధ్యాపకులు సూచరణ్ ను అభినందించారు. ఈ కార్యక్రమానికి జువాలజీ అధ్యాపకులు డాక్టర్.కె. వి.బిక్షమయ్య విద్యార్థులు సామల్ల సంపత్, రాచర్ల హర్షిత తదితర విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :