- హైదరాబాద్‌లోనే పవన్ ఎందుకు సభ పెడుతున్నారని ప్రశ్న
- హైదరాబాద్ సభపై పవన్ కల్యాణ్‌కు పొన్నం ప్రభాకర్ అల్టిమేటం.. క్షమాపణ చెప్పాకే అడుగుపెట్టాలని డిమాండ్!
హైదరాబాద్‌లో జనసేన అధినేత, ఏపీ పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన ‘నవనిర్మాణ సభ’పై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు
“తెలంగాణ దృష్టి పడితే కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతాయి” అంటూ గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, భావాలను తీవ్రంగా గాయపరిచాయని పొన్నం మండిపడ్డారు. దీని వెనుక బీజేపీతో పవన్‌కు ఉన్న ‘తెరవెనుక ఒప్పందం’ స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
ఈ సభ నిజంగా అభివృద్ధి కోసమే అయితే గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు లేదా కేరళలో పెట్టుకోవచ్చు కదా… కేవలం హైదరాబాద్‌లోనే ఎందుకు పెడుతున్నారని మంత్రి ప్రశ్నించారు. పవన్ గనుక క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ ప్రజలు ఈ సభను తీవ్రంగా వ్యతిరేకిస్తారని హెచ్చరించారు.









